Namaste NRI

ఆ విషయంలో మేము విజయం సాధించాం : సూర్యదేవర నాగవంశీ

విశ్వక్‌సేన్‌ హీరోగా అనుదీప్‌ కేవీ దర్శకత్వంలో సూర్యదేవర నాగవంశీ, సాయిసౌజన్య నిర్మించిన ఫంకీ చిత్రం ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సక్సెస్‌మీట్‌లో విశ్వక్‌సేన్‌ మాట్లాడారు. తన కెరీర్‌లో గుర్తుండిపోయే సినిమా అవుతుందని ఆయన ఆనందం వ్యక్తం చేశారు. ఫంకీ చిత్రానికి అన్ని వర్గాల నుంచి అద్భుతమైన స్పందన లభిస్తున్నదని అన్నారు. ప్రేక్షకులతో కలిసి థియేటర్లో సినిమా చూశానని, అందరూ బాగా ఎంజాయ్‌ చేస్తున్నారని తెలిపారు.

నిర్మాత సూర్యదేవర నాగవంశీ మాట్లాడుతూ ప్రేక్షకులను నవ్వించాలనే ఉద్దేశ్యంతో ఈ సినిమా చేశాం. ఆ విషయంలో మేము విజయం సాధించాం. సెకండాఫ్‌లో మదర్‌ సెంటిమెంట్‌ బాగా పండిందని చెబుతున్నారు. నవ్వుకోవడానికే థియేటర్లకు రండి. రెండున్నర గంటలు మనసారా నవ్వుతారు’ అన్నారు. కామెడీతో పాటు భావోద్వేగాలు కూడా బాగా పండాయని దర్శకుడు పేర్కొన్నారు. ప్రేక్షకులు ప్రతీ సీన్‌ను ఎంజాయ్‌ చేస్తున్నారని కథానాయిక కయాదు లోహర్‌ తెలిపింది. ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్‌ సభ్యులందరూ పాల్గొన్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events