అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రష్యా జోక్యం చేసుకున్నట్లు పెద్దఎత్తున ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే అధ్యక్ష ఎన్నికల్లో రష్యా జోక్యంపై వచ్చిన ఆరోపణలను ఏళ్ల తరబడి ఖండిస్తూ వచ్చిన పుతిన్ సన్నిహితుడు, వ్యాపారవేత్త యెవ్జెనీ ప్రిగోజిన్ మొదటిసారి నిజాన్ని వెల్లడిరచారు. ఈ అంశానికి సంబంధించి సామాజిక మాధ్యమంలో వచ్చిన వ్యాఖ్యలకు స్పందిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో జోక్యం చేసుకున్నాం. ఇప్పుడూ చేసుకుంటున్నాం. భవిష్యత్తులోనూ జోక్యం చేసుకుంటాం. ఇది మా సొంత విధానంలోనే అత్యంత జాగ్రత్తగా ఎంతో కచ్చితత్వంతో, లక్ష్యాత్మకంగా జరుగుతుంది అని ప్రిగోజిన్ పేర్కొన్నాడు. అగ్రరాజ్యంలో మధ్యంతర ఎన్నికల వేళ ఆయన ప్రకటన చర్చనీయాంశంగా మారింది.