కృత్రిమ మేధ సాయంతో రూపొందుతున్న డీప్‌ఫేక్ వీడియోలు, చిత్రాలపై మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల ఆందోళన వ్యక్తం చేశారు. ఇది భయానకమైందిగా పేర్కొన్నారు. అమెరికాలో ప్రముఖులకు చెందిన డీప్‌ఫేక్ ఫొటోలు, చిత్రాలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. తాజాగా అమెరికన్ పాప్ సింగర్ టేలర్ స్విఫ్ట్‌కు చెందిన డీప్‌ఫేక్ అశ్లీల దృశ్యాలు నెట్టింట వైరల్ అయ్యాయి. నెట్టింట ఈ ట్రెండ్ అత్యంత భయానకం. టెక్నాలజీ దుర్వినియోగంపై ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి అని ఆయన అన్నారు. సత్య నాదెళ్ల మాట్లాడుతూ టెక్నాలజీ దుర్వినియోగం ప్రమాదకరం, భయంకరమైంది. దీనిని అరికట్టేందుకు వేగంగా స్పందించాల్సిన అవసరముంది. ఆన్‌లైన్‌లో సురక్షితమైన సమాచారం ఉండేలా కట్టుదిట్టమైన నిబంధనలు రావాలి. దర్యాప్తు సంస్థలు, టెక్ సంస్థలు కలిసి వస్తే, డీప్‌ఫేక్ అరికట్టడం పెద్ద విషయం కాదు అని సత్యనాదెళ్ల అభిప్రాయపడ్డారు