కాళ్లు, చేతులు నరకడం, రాళ్లతో కొట్టి చంపడం లాంటి శిక్షలను త్వరలోనే అఫ్గాన్‌లో అమలు చేస్తామని తాలిబన్ సీనియర్ నేత ముల్లా నూరుద్దీన్ తురాబీ అన్నారు. వాటిని బహిరంగంగా అమలు చేయాలా లేదా అన్నదానిపై నిర్ణయం తీసుకోవాల్సి ఉందన్నారు. మా చట్టాలు ఎలా ఉండాలో వేరేవాళ్లు చెప్పాల్సిన అవసరం లేదు అని పేర్కొన్నారు. ఖురాన్‌ను బట్టి తమ చట్టాలు ఉంటాయన్నారు. మేం వేరే దేశాల్లో చట్టాలపై జోక్యం చేసుకోనప్పుడు వాళ్లు ఎందుకు మా చట్టాలను విమర్శించాలి అంటూ ప్రశ్నించారు. చేతులు, కాళ్లు నరకడం ప్రజల భద్రతకు అవసరం అని పేర్కొన్నారు. 1990 దశకంలో ఆఫ్ఘనిస్తాన్‌ను తాలిబన్లు ఏలిన రోజుల్లో ఇలాంటి శిక్షలనే అమలు చేసేవారు. ఈ ఏడాది ఆగస్టు 15వ తేదీన ఆప్ఘనిస్తాన్ తిరిగి చేజిక్కించుకున్న తాలిబన్లు మెల్లమెల్లగా తమ స్టయిల్‌లో పాలనను అమలులోకి తీసుకువస్తున్నారు.