హమాస్‌తో జరుగుతున్న యుద్ధంలో కాల్పుల విరమణ పాటించాలన్న అంతర్జాతీయ సమాజం కోరికను ఇజ్రాయెల్ తోసిపుచ్చింది. యుద్ధాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేసింది. మేం చివరి వరకు కొనసాగిస్తాం. అందులో మరో ప్రశ్న లేదు. మమ్మల్ని ఏదీ ఆపలేదు అని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు తెలిపారు. షిజైయహ్ మిగతా ప్రాంతాల్లో కొన్ని రోజులుగా భారీగా యుద్ధం కొనసాగుతున్నది. వేలాది మంది గాజా తూర్పు ప్రాంతంలోనే ఉండిపోయారు. తాము ఇండ్లకు తిరిగి వెళ్లలేమేమోనని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
