కెనడాకు చెందిన అపోటెక్స్ అనే కంపెనీ అధినేత బార్రీ షెర్మన్, అతడి భార్య హనీ ఐదేండ్ల క్రితం హత్యకు గురయ్యారు. ఇంటి ఆవరణలోని స్విమ్మింగ్‌పూల్ రెయిలింగ్‌కు బెల్టులతో ఉరివేసి వీరిని హత్య చేశారు. ఐదేండ్లు గడిచినా ఈ హత్య చేసిన వారిని పోలీసులు గుర్తించలేకపోయారు. దీంతో తన తల్లిదండ్రులను హత్య చేసిన వారిని పట్టుకునేందుకు వారి కుమారుడు జొనాథన్ షెర్మన్ ప్రయత్నాలు ప్రారంభించారు. హంతకుడి ఆచూకీ తెలిపిన వారికి రూ.212 కోట్లు ఇస్తానని ప్రకటించారు. తన తల్లిదండ్రుల హత్య తనను ఐదేండ్లుగా పీడకలగా వేధిస్తున్నదని, ఈ బాధ నుంచి బయటపడాలంటే వారిని చంపిన వారికి శిక్ష పడాలని ఆయన పేర్కొన్నారు.