ఇరాన్ కొత్త తరహా క్రూయిజ్ మిస్సైల్ ను డెవలప్ చేసింది. సుమారు 1650 కిలోమీటర్ల దూరంలో ఉన్న టార్గెట్‌ను పావే మిస్సైల్ చేధించగలదు. ఈ విషయాన్ని ఆ దేశ రెవల్యూషనరీ గార్డ్స్ కమాండర్ తెలిపారు. తమ టాప్ కమాండర్‌ను చంపిన అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను హతమార్చేందుకు ఈ క్షిపణిని వాడనున్నట్లు రెవల్యూషనరీ గార్డ్స్ వైమానిక దళ చీఫ్ అమిరాలి హజిజాదే తెలిపారు. 1650 కిలోమీటర్ల దూరం వెళ్లే క్రూయిజ్ మిస్సైల్ను ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ అమ్ములపొదిలో చేర్చినట్లు ఆయన వెల్లడించారు. అయితే పేద సైనికులను చంపేందుకు తాము క్షిపణులను తయారు చేయలేదని, తమ కమాండర్ ఖాసిమ్ సులేమాని హతమార్చిన వారిని చంపేందుకు ప్రతీకారంతో ఉన్నట్లు హజిజాదే తెలిపారు. ట్రంప్, అమెరికా మాజీ విదేశాంగ మంత్రి పాంపియో, సులేమాని హత్యకు ఆదేశాలు ఇచ్చిన మిలిటరీ కమాండర్లను హతమార్చనున్నట్లు వెల్లడించారు.