గ్రీన్‌ల్యాండ్‌ను స్వాధీనం చేసుకునేందుకు సైనిక బలగాలను వాడనున్నట్లు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మరోసారి పేర్కొన్నారు. వైట్‌హౌజ్‌లో చమురు కంపెనీల ప్రతినిధులతో జరిగిన సమావేశంలో ఈ విషయాన్ని ట్రంప్ పేర్కొన్నారు. ఆర్కిటిక్ దీవిపై గుత్తాధిపత్యం ఉన్నట్లు డెన్మార్క్ చేస్తున్న వాదనలను ట్రంప్ కొట్టిపారేశారు. గ్రీన్‌ల్యాండ్ స్వాధీనం కోసం ఏదో ఒకటి చేస్తామని, అది వారికి నచ్చినా నచ్చకపోయినా ఇది జరుగుతుందన్నారు. గ్రీన్‌ల్యాండ్ అంశంలో డీల్ చేయాలన్న ఆలోచన ఉందని, చాలా ఈజీ పద్ధతిలో అది జరగాలని, ఒకవేళ అలా జరగకుంటే, అప్పుడు కఠిన పద్ధతిలో ఆ డీల్ చేస్తామన్నారు.

ఖనిజ సంపద కలిగిన దీవిలో అమెరికా జాతీయ భద్రత ముఖ్యమని, ఎందుకంటే ఆర్కిటిక్ ప్రాంతంలో రష్యా, చైనా దేశాలు తన సైనిక కార్యకలాపాలను పెంచుకుంటున్నాయన్నారు. గ్రీన్‌ల్యాండ్‌ను రష్యా, చైనా ఆక్రమించుకోకముందే తాము ఆ దేశాన్ని స్వాధీనం చేసుకోనున్నట్లు చెప్పారు. గ్రీన్‌ల్యాండ్ గురించి ఏదో ఒకటి చేస్తామని, అయితే మంచిగా లేదంటే విభిన్నంగా వ్యవహరిస్తామన్నారు. వాస్తవానికి గ్రీన్‌ల్యాండ్‌లో ఇప్పటి అమెరికా మిలిటరీ బేస్ ఉన్నది.















