Namaste NRI

ఎల్‌ఏసీ కోసం భారత్‌తో.. కలిసి పనిచేస్తాం

ఎల్‌ఏసీ వెంట శాంతి కోసం భారత్‌తో కలిసి పని చేస్తున్నామని చైనా రక్షణ మంత్రి జనరల్‌ వీ ఫెంఘే తెలిపారు. సింగపూర్‌లోని షాంగ్రీ`లా చర్చల్లో ఆయన మాట్లాడారు. రెండు పొరుగు దేశాలన్నీ సత్సంబంధాలు కొనసాగించడం భారత్‌, చైనాకు ప్రయోజనాలకు అనుగుణంగా ఉన్నాయన్నారు. దక్షిణ చైనా సముద్రంతో సహా ప్రాదేశిక వివాదాలను పరిష్కరించుకునేందుకు శాంతియుత మార్గాలపై పిలుపునిచ్చారు. భారత్‌ నియంత్రణ రేఖ (ఎల్‌ఏసీ) వెంట వివాదంపై ఓ ప్రశ్నకు సమాధానం ఇస్తూ మేం భారత్‌తో కమాండ్‌ స్థాయిలో 15 రౌండ్ల చర్చలు జరిపాం. ఈ ప్రాంతంలో శాంతి కోసం కలిసి పనిచేస్తున్నాం అని బ్రూకింగ్స్‌ ఇనిస్టిట్యూషన్‌లోని ఇండియా ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ తన్వి మదన్‌ అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events