Namaste NRI

అల్లు ఇంట పెళ్లి సందడి .. తొలి శుభలేఖ మెగాస్టార్‌కే

అల్లు కుటుంబంలో పెళ్లి వేడుకల హడావిడి మొదలైంది. నటుడు అల్లు శిరీష్ తన ప్రేయసి నయనికతో త్వరలోనే వివాహ బంధంలోకి అడుగుపెట్టనున్నాడు. గత అక్టోబర్‌లో ఈ జంట నిశ్చితార్థం చేసుకున్న సంగతి తెలిసిందే. కొద్ది రోజుల క్రితం దుబాయ్‌లో ప్రీ–వెడ్డింగ్ వేడుకలు నిర్వహించుకోవడంతో వారి పెళ్లి వార్తలు మరింత హైలైట్ అయ్యాయి. ఇప్పుడు అధికారికంగా పెళ్లి పనులు ప్రారంభమైనట్లు తెలుస్తోంది. ఇటీవల పసుపు కార్యక్రమంతో శుభారంభం చేసినట్లు అల్లు శిరీష్ వెల్లడించాడు. కుటుంబ సభ్యుల సమక్షంలో సాంప్రదాయ పద్ధతుల్లో కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. తాజాగా పెళ్లి పత్రికల పంపిణీ కార్యక్రమం కూడా ప్రారంభమైంది.

తెలుగు సంప్రదాయం ప్రకారం మొదటి పెళ్లి పత్రికను కుటుంబ పెద్దలకు అందించడం ఆనవాయితీ. అదే విధంగా అల్లు శిరీష్ తన తల్లిదండ్రులతో కలిసి మెగాస్టార్ చిరంజీవి, ఆయన భార్య సురేఖ కొణిదెల దంపతులకు తొలి ఆహ్వాన పత్రిక అందజేశారు.మన తెలుగు సాంప్రదాయం ప్రకారం మొదటి పెళ్లి పత్రికను మా మామయ్య, అత్తయ్యలకు అందించాం అని పేర్కొన్నారు. ఈ వేడుకలో నిర్మాత అల్లు అరవింద్, ఆయన సతీమణి నిర్మలతో పాటు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events