Namaste NRI

వెల్‌కమ్‌ టు వాషింగ్టన్.. న్యూయార్క్‌లో మరోసారి అదేపొరపాటు

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌  మాటల తడబాటు కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే పలు సందర్భాల్లో అంతర్జాతీయ వేదికలపై మతిమరుపు, తడబాట్లతో తీవ్ర విమర్శలపాలైన బైడెన్‌, తాజాగా మరోసారి అదేపొరపాటు చేసి మీడియాకు చిక్కారు. న్యూయార్క్‌లోని బార్‌క్లే హోటల్‌లో జరిగిన ఓ కార్యక్రమానికి ప్రపంచ ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రతినిధులను ఉద్దేశించి ప్రసంగిస్తున్న సమయంలో బైడెన్‌ తడబడ్డారు. స్టేజ్‌పైకి బైడెన్‌ వెళ్తుండగా, అంతా చప్పట్లు కొట్టారు. దీంతో ముందుగా అందరికీ ధన్యవాదాలు తెలిపిన బైడెన్‌, ఆ తర్వాత వెల్‌కమ్‌ టు వాషింగ్టన్‌  అంటూ ప్రసంగం మొదలు పెట్టారు. ఏ రాష్ట్రంలో ఉన్నామన్నది కూడా గుర్తు లేకుండా న్యూయార్క్‌ కు బదులు వాషింగ్టన్‌ అని సంబోధించారు. ఆ తర్వాత ఒక్క క్షణం ఆగిపోగిపోయిన బైడెన్‌, తన ప్రసంగాన్ని కొనసాగించారు. అధ్యక్షుడి తీరుతో అక్కడివారు ఒక్కసారిగా స్టన్‌ అయ్యారు.

మతిమరుపు, పొరపాట్లతో అధ్యక్షుడు బైడెన్‌ ఇటీవలే నిత్యం హెడ్‌లైన్స్‌లో నిలిచిన విషయం తెలిసిందే. అంతేకాదు ఒకరిపేరు పలకడానికి బదులు మరొకరి పేరు పలకడం, పలు సందర్భాల్లో ఆయన ఎటూ క‌ద‌ల‌కుండా చ‌ల‌నం లేని రీతిలో నిలుచుండిపోవడం వంటివి జరిగాయి. దీంతో బైడెన్‌ ఆరోగ్యంపై రకరకాల ఊహాగానాలు వినిపించాయి. 83 ఏళ్ల బైడెన్‌ వ‌య‌సు సంబంధిత స‌మ‌స్యల‌తో బాధపడుతున్నారని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అధ్యక్షుడికి పార్కిన్సన్‌ ఉన్నట్లు ప్రచారం కూడా జరిగింది. ఈ నేపథ్యంలో బైడెన్‌ ఆరోగ్య పరిస్థితిపై వైట్‌హౌస్‌లో అధ్యక్షుడి వైద్యుడు డాక్టర్‌ కెవిన్‌ స్పష్టతనిచ్చారు. ప్రస్తుతం అధ్యక్షుడి ఆరోగ్యం అద్భుతంగా ఉందని తెలిపారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events