
ప్రధాన మంత్రి మోదీ పరట్యనకు ముందు రష్యా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. మోదీ పూర్తి స్థాయి పర్యటన తమకు చాలా ముఖ్యమైనదని పేర్కొంది. ఈ పర్యటన పట్ల పాశ్చాత్య దేశాలు ఈర్ష్యతో ఉన్నాయని వ్యాఖ్యానించింది. ఈ మేరకు ఆ దేశం ఒక ప్రకటన విడుదల చేసింది. ప్రధాని మోదీ, అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ శిఖరాగ్ర స్థాయి చర్చలు చేపడతారని వెల్లడించింది. కాగా, ఉక్రెయిన్‌పై రష్యా దండయాత్ర తర్వాత మాస్కోను ప్రధాని మోదీ సందర్శించడం ఇదే తొలిసారి. అదేవిధంగా, భారత ప్రధాని ఆస్ట్రియాకు వెళ్లడం 41 ఏళ్లలో ఇదే మొదటిసారి కావడం విశేషం.
