ప్రవీణ్ కండెలా, శ్రీకాంత్ రాథోడ్, జయెత్రి మనాకా, శివరామ్ రెడ్డి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా తుపాకుల గూడెం. ఈ చిత్రాన్ని వారధి క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తున్నది. జైదీప్ విష్ణు దర్శకుడు. తాజాగా హైదరాబాద్లో సినిమా ప్రీరిలీజ్ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా దర్శకుడు జైదీప్ విష్ణు మాట్లాడుతూ మంచి టీమ్ దొరకడం వల్ల ఈ సినిమాను అనుకున్నట్లు తెరకెక్కించగలిగాను. చిత్రీకరణ సమయంలో తెలంగాణ పోలీస్ అందించిన సహకారం మర్చిపోలేము. మణిశర్మ అందించిన సంగీతం మా చిత్రానికి ఆకర్షణ అవుతుంది. యాక్షన్, ఎమోషన్, ఎంటర్టైన్మెంట్స్ కలిసిన చిత్రమిది. సినిమా చూశాక భావోద్వేగానికి గురవుతారు. అమెరికాలోనూ మా చిత్రాన్ని విడుదల చేస్తున్నాం్ణ అన్నారు. ఫిబ్రవరి 3న ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతున్నది.
