మిన్న మద్దిపాటి, స్మిరిత రాణి హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా గ్రంథాలయం. వైష్ణవి శ్రీ నిర్మిస్తున్నారు. సాయి శివన్ జంపన దర్శకుడు. ఈ సినిమా టీజర్‌ను నిర్మాత బెక్కం వేణుగోపాల్ రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సినిమా హిట్ కావాలి అని ఆకాక్షించారు. ఈ సందర్భంగా దర్శకుడు సాయి శివన్ మాట్లాడుతూ యాక్షన్ థ్రిల్లర్ జానర్‌లో ఓ సరికొత్త ప్రయత్నం చేశాం. ఈ తరహాలో ఇలాంటి కథ రాలేదని చెప్పవచ్చు. చేవెళ్ల దగ్గర ఎక్కువ భాగం చిత్రీకరణ జరిపాం. వినూత్న సినిమాగా ఆకట్టుకుంటుంది అన్నారు. త్వరలో విడుదల కానుంది. ఈ చిత్రానికి కెమెరా: సామల భాస్కర్, సంగీతం: వర్దన్, నేపథ్య సంగీతం: చిన్నా, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: అయ్యప్ప, లైన్ ప్రొడ్యూసర్: మహేష్ బాబు దొప్పలపూడి.