అమెరికాలో ఆశ్రయం కోరి వచ్చిన వారిపై టైటిల్ – 42 పేరుతో విధించిన ఆంక్షల గడువు ముగిసింది. దీంతో అమెరికా మెక్సికో సరిహద్దుకు శరణార్ధులు బారులు తీరుతున్నారు. టైటిల్ – 42 స్థానంలో బైడెన్ సర్కారు కొత్త విధానం తీసుకువచ్చింది. కరోనా సమయంలో ట్రంప్ ప్రభుత్వం టైటిల్ – 42 తీసుకొచ్చింది. ఈ విధానం ప్రకారం అమెరికా – మెక్సికో బార్డర్‌కు వచ్చే వలసదారులు శరణు కోరడాన్ని తిరస్కరించవచ్చు. ఈ టైటిల్ – 42 వచ్చినప్పటి నుంచి దాదాపు 28 లక్షల మందికి ఆశ్రయం ఇచ్చేందుకు నిరాకరించినట్లు లెక్కలు చెబుతున్నాయి. అయితే చట్టపరమైన చర్యలు మాత్రం ట్రంప్ ప్రభుత్వం తీసుకోలేదు. మే 11న దీని గడువు ముగియడంతో బైడెన్ ప్రభుత్వం కొత్త నిబంధనలను తీసుకొచ్చింది.
![](https://namastenri.net/wp-content/uploads/2023/05/9f49e8d2-8280-46f1-9cd4-82d86a88c854-49-50.jpg)
![](https://namastenri.net/wp-content/uploads/2023/05/45af6911-9449-466d-a7e1-ba146800284b-50.jpg)
కొత్త నిబంధనల ప్రకారం ఎవరైనా అమెరికాలో ఆశ్రయం కోరవచ్చు. అయితే ఆన్‌లైన్‌లో ముందే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. వీరికి బార్డర్‌లో వివిధ రకాల పరీక్షలు చేస్తారు. టైటిల్ 42 స్థానంలో కొత్త నిబంధన తీసుకురావడంతో సరిహద్దుకు శరణు కోరి వచ్చేవారి సంఖ్య పెరుగుతోంది. అక్కడి శిబిరాలు కిక్కిరిసిపోతున్నాయి. వీరి ఇంటర్వ్యూ చేసి అనుమతులు మంజూరు చేసేసరికి కొన్ని నెలలు పట్టే అవకాశం ఉంది. ఆన్‌లైన్‌లో అప్లై చేసుకున్న వారికే తొలి ప్రాధాన్యం ఉంటుందని అధికారులు చెబుతున్నారు. సీబీపీ వన్ యాప్ ద్వారా అప్లై చేసుకున్నవారిన కూడా అనుమతిస్తున్నారు. ఎవరైనా అక్రమంగా సరిహద్దు దాటి అమెరికాలోకి ప్రవేశిస్తే వారు క్రిమినల్ విచారణను ఎదుర్కోవడంతోపాటు 5 ఏళ్ల పాటు అమెరికాకు వచ్చేందుకు అవకాశం ఉండదు.
![](https://namastenri.net/wp-content/uploads/2023/05/638bff07-efd2-4cc9-8546-98039833db3c-53.jpg)