కేజీఎఫ్ అభిమానులకు శుభవార్త. కేజీఎఫ్ ఛాప్టర్ 1, 2 తరువాత ఇప్పుడిక కేజీఎఫ్ చాప్టర్ 3 కోసం నిరీక్షణ కొనసాగుతోంది. కేజీఎఫ్ ఛాప్టర్ 3 షూటింగ్ ఎప్పుడనేది చెప్పేశారు నిర్మాతలు . కేజీఎఫ్ రెండు చిత్రాలు హీరోయిజానికి బెంచ్ మార్క్ క్రియేట్ చేశాయి. దీంతో ప్రశాంత్ నీల్ సినీ ప్రియులతో పాటు దేశవ్యాప్తంగా స్టార్ హీరోలకు ఫేవరేట్ డైరెక్టర్ అయిపోయాడు. హీరో యష్‌ను పాన్ ఇండియా స్టార్‌ను చేసిందీ సినిమా. కేజీఎఫ్ 2 గతేడాది ఏప్రిల్ 14న విడుదలైంది.


ఈ సినిమా రిలీజైన ఏడాది సందర్భంగా నిర్మాణ సంస్థ హోంబలే ఫిలింస్ రీవిజింట్ రాకీస్ ఎంపైర్ అంటూ ఓ వీడియోను విడుదల చేసింది. ఇందులో కేజీఎఫ్ రెండు చిత్రాల్లో రాకీ భాయ్ సాగించిన ప్రయాణాన్ని చూపించారు. అతను ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాడు అని చివరలో కేజీఎఫ్ ఛాప్టర్ 3 కి హింట్ ఇస్తూ 3 అంకెను చూపించారు. దాంతో ప్రొడ్యూసర్ విజయ్ కిరంగదూర్ కూడా కేజీఎఫ్-3 ఎప్పుడు ప్రారంభమవుతుందో స్పష్టంగా చెప్పలేని పరిస్థితి. అయితే ఒక్కటి మాత్రం క్లియర్‌గా చెప్పాడు. ప్రస్తుతం దర్శకుడు ప్రశాత్ నీల్..ప్రభాస్‌తో సలార్ సినిమా, ఎన్టీఆర్‌తో మరో సినిమా చేయనున్నాడు. ఈ రెండూ పూర్తయిన తరువాత ఛాఫ్టర్ 3 తెరకెక్కనుందని హోమెబుల్ సంస్థ వెల్లడించింది. అంటే 2024 చివర్లో లేదగా 2025 ప్రారంభంలో ఈ సినిమా తెరకెక్కనుంది.
