మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్టు పొన్నియన్ సెల్వన్-2. లీడింగ్ ప్రొడక్షన్ హౌజ్ లైకా ప్రొడక్షన్ స్టన్నింగ్ అప్‌డేట్ వీడియో లాంఛ్ చేసింది. చోళ సామ్రాజ్యం నేపథ్యంలో కొనసాగనున్న సీక్వెల్ పార్టు అప్‌డేట్‌ను విక్రమ్, జయం రవి, కార్తీ, ఐశ్వర్యారాయ్ పాత్రల విజువల్స్ తో అందించింది మణిశర్మ టీం. పొన్నియన్ సెల్వన్-2 పస్ట్ పార్టును మించి కలర్‌ఫుల్‌గా ఉండబోతున్నట్టు తాజా వీడియోతో అర్థమవుతుంది.
ఈ భారీ మల్టీస్టారర్ ఫస్ట్ పార్టులో విక్రమ్, నాజర్, శరత్‌కుమార్, జయరామ్, విక్రమ్ ప్రభు, కార్తీ, జయం రవి, పార్థీబన్, ప్రకాశ్ రాజ్, శోభితా ధూళిపాళ, ఐశ్వర్యా రాయ్, త్రిష కీలక పాత్రలు పోషించారు. మరి రెండో పార్టులో కూడా వీరంతా ఉంటారా? లేదంటే, కొత్త యాక్టర్లెవరైనా యాడ్ అవుతారా? అనేది తెలియాల్సి ఉంది. మద్రాస్ టాకీస్, లైకా ప్రొడక్షన్స్ బ్యానర్లు సంయుక్తంగా సీక్వెల్ పార్టును కూడా తెరకెక్కిస్తున్నాయి. తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో 2023 ఏప్రిల్ 28న పొన్నియన్ సెల్వన్ -2 ప్రపంచవ్యాప్తంగా సినిమా థియేటర్లలో సందడి చేయనున్నట్టు ప్రకటించింది. కాగా పొన్నియన్ సెల్వన్-1 ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకొచ్చిన విషయం తెలిసిందే. భారీ మల్టీస్టారర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు రాబట్టింది.