అర్టికల్ 370 రద్దు తరువాత సరిహద్దులో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అణ్వాయుధాల వ్యాప్తిని, అణు యుద్ధాన్ని నివారించాలని చైనా, రష్యా, బ్రిటన్, అమెరికా, ఫ్రాన్స్ అంగీకారానికి వచ్చాయి. ఈ ఐదు దేశాల ఉమ్మడి ప్రకటనను రష్యా ప్రచురించింది. అణ్వాయుధ సామర్థ్యం గల దేశాల మధ్య యుద్ధాన్ని నివారించడం తమ ప్రధాన బాధ్యత అని ఆ దేశాలు పేర్కొన్నాయి. అణు యుద్ధంలో గెలుపు అనేది ఉండదని పేర్కొన్నాయి. ఈ దేశాలు ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో శాశ్వత సభ్య దేశాలనే విషయం తెలిసిందే. సురక్షిత వాతావరణాన్ని ఏర్పాటు చేసేందుకు అన్ని దేశాలతో కలిసి పని చేయడం తమ లక్ష్యమని చైనా, రష్యా, బ్రిటన్, అమెరికా, ఫ్రాన్స్ పేర్కొన్నట్లు తెలిపింది.
వ్యూహాత్మక నష్టాలను తగ్గించడం, అణ్యాయుధ సామర్థంగల దేశాల మధ్య యుద్ధాన్ని నివారించడం తమ ప్రధాన బాధ్యత అని ఈ దేశాలు పేర్కొన్నట్లు తెలిపింది. అణు యుద్ధాన్ని గెలవలేని, అణు యుద్ధం ఎప్పుడూ చేయాకూడదని గట్టిగా చెప్తున్నట్లు పేర్కొంది. అణ్వాయుధాల వాడకం వల్ల పర్యవసానలు తీవ్రంగా ఉంటాయని తెలిపింది. దురాక్రమణను నిరోధించడానికి, యుద్ధాన్ని నివారించడానికి మాత్రమే వాడాలని అంగీకరించినట్లు పేర్కొంది. ప్రస్తుతం అమెరికా` రష్యా, అమెరికా`చైనా మధ్య సంబంధాలు అంతంత మాత్రంగా ఉన్న నేపథ్యంలో ఈ ప్రకటన వెలువడిరది. ఫ్రాన్స్ విడుదల చేసిన ప్రకటనలో అణ్వాయుధాల నియంత్రణ, నిరాయుధీకరణ కోసం చైనా, రష్యా, బ్రిటన్, అమెరికా, ఫ్రాన్స్ తమ దృఢ నిశ్చయాన్ని పునరుద్ధాటించినట్లు తెలిపింది.
అణు యుద్ధ ప్రభావాన్ని ఊహించలేం. ఈ యుద్ధ ప్రభావం భూమండలంపై ప్రతి జీవిపై ఉంటుంది. అణ్వాయుధాన్ని డిజైన్ చేసిన దానిని బట్టి కూడా ప్రభావం ఉంటుంది. అణుబాంబ్ పేలినప్పుడు దానిలో 35 శాతం హిట్ బయటకు వస్తుంది. ఒక మెగాటన్ను అణుబాంబ్ పేలితే దాని తీవ్రత 13 నుంచి 50 మైళ్ల వరకు ఉంటుంది. పేలుడు ప్రభావం ఎలా ఉంటుందంటే మనుషులు మాడిమసై పోతారు.














