అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రధాని మోదీని ఒకవైపు ప్రశంసిస్తూనే మరోవైపు నుంచి చురకలు అంటించారు. మోదీ చాలా మంచి వ్యక్తి అని పొగుడ్తూనే.. తనకు నచ్చినట్లుగా చేయకపోతే సుంకాలు పెంచుతానని హెచ్చరించారు. వెనెజువెలా అధ్యక్షుడు నికోలస్ మదురో విషయంలో చేపట్టబోయే చర్యల గురించి చెబుతున్న వేళ ట్రంప్ భారత్ గురించి కూడా ప్రస్తావించారు.

రష్యా చమురు కొనుగోళ్లను భారత్ తగ్గించిందని.. తనను సంతోషపెట్టేందుకే భారత ప్రధాని మోదీ ఈ నిర్ణయం తీసుకున్నారని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తెలిపారు. వాళ్లు నన్ను సంతోషపెట్టాలని భావించారు. ప్రధాని మోదీ చాలా మంచి వ్యక్తి. నేను సంతోషంగా లేనన్న విషయం ఆయనకు తెలుసు. నన్ను సంతోషపెట్టడం చాలా ముఖ్యం. రష్యాతో వారు వ్యాపారం కొనసాగిస్తేం.. మనం చాలా వేగంగా టారిఫ్‌లు పెంచుతాం అని ట్రంప్ హెచ్చరించారు.















