భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన వ్యాక్సిన్ కొవాగ్జిన్‌ను అత్యవసర సమయంలో వాడేందుకు అనుమతించే విషయమై వచ్చేవారం తుది నిర్ణయం తీసుకుంటామని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) తెలిపింది. ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా వెల్లడిరచింది. వచ్చే వారం డబ్ల్యూహెచ్‌వో, స్వతంత్ర గ్రూప్ నిపుణులు సమావేశమై తుది నిర్ణయం తీసుకుంటారని తెలిపింది. ఇప్పటికే కొవాగ్జిన్ వ్యాక్సిన్ తయారీకి సంబంధించిన డేటాను డబ్ల్యూహెచ్‌వోకు భారత్ బయోటెక్ అందజేసింది. గత నెల 27న డబ్ల్యూహెచ్‌వో విజ్ఞప్తి మేరకు అదనపు సమాచారం సమర్పించింది. ఈ సమాచారాన్ని ప్రస్తుతం తమ నిపుణులు సమీక్షిస్తున్నారని డబ్ల్యూహెచ్‌వో తెలిపింది. ఒకవేళ తలెత్తే సందేహాలపై వచ్చేవారం తుది మదింపు చేస్తామని తెలిపింది.