Namaste NRI

తప్పకుండా సిక్సర్‌ కొడతా :రత్నం కృష్ణ

కిరణ్‌ అబ్బవరం, నేహా శెట్టి జంటగా నటిస్తున్న చిత్రం రూల్స్‌ రంజన్‌. రత్నం కృష్ణ దర్శకుడు. ప్రముఖ నిర్మాత ఏం.ఎం.రత్నం సమర్పణలో దివ్యాంగ్‌ లవానియా, మురళీకృష్ణ వేమూరి నిర్మిస్తున్నారు. హైదరాబాద్‌లో ప్రీరిలీజ్‌ వేడుకను నిర్వహించారు. దర్శకుడు మాట్లాడుతూ కాలేజీ పూర్తయిన తర్వాత జీవితం గురించి యువతరం తాలూకు ఆలోచనలను ఈ సినిమాలో ఆవిష్కరించాం. యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్‌గా మెప్పిస్తుంది. నేను సిక్సర్‌ కొట్టడానికి దొరికిన లాస్ట్‌బాల్‌ ఈ సినిమా అనుకుంటున్నా. తప్పకుండా కొట్టి చూపిస్తా  అన్నారు.

పూర్తి వినోదాత్మకంగా సాగే చిత్రమిదని హీరో కిరణ్‌ అబ్బవరం తెలిపారు. తాను నిర్మించే ప్రతీ సినిమాలో సోషల్‌ మెసేజ్‌ ఉంటుందని, భవిష్యత్తులో కిరణ్‌ అబ్బవరంతో మరో సినిమా చేస్తానని, దానికి తానే దర్శకత్వం వహిస్తానని ఏం.ఎం.రత్నం పేర్కొన్నారు.  ఆర్ట్‌ డైరెక్టర్‌ సుధీర్‌ మాట్లాడుతూ అక్టోబర్‌ 6న చిత్రం విడుదల కానుంది. కుటుంబం మొత్తం కలిసి ఎంజాయ్‌ చేసేలా ఉంటుంది. షూర్‌షాట్‌గా సినిమా హిట్‌ అవుతుంది అని అన్నారు. ఈ నెల 6న విడుదలకానుంది.  ఈ కార్యక్రమంలో దర్శకుడు అనుదీప్‌ కేవీ, హైపర్‌ ఆది తదితరులు పాల్గొన్నారు.

Social Share Spread Message

Latest News