గోవా లో 53వ అంతర్జాతీయ భారతీయ చలన చిత్రోత్సవంలో భాగంగా టాలీవుడ్ స్టార్ హీరో చిరంజీవి కి ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్`2022 గా ప్రత్యేక గుర్తింపు దక్కిన విషయం తెలిసిందే. ఫిలిం ఫెస్టివల్ ముగింపు వేడుకల్లో కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ చేతుల మీదుగా చిరంజీవి అవార్డు అందుకున్నారు. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ నాకు ఈ అవార్డు ప్రదానం చేసి గొప్ప గౌరవాన్ని అందించినందుకు ఐఎఫ్‌ఎఫ్‌ఐ, భారత ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. కొన్ని గుర్తింపులకు ప్రత్యేక విలువ ఉంటుంది. ఈ పురస్కారం అలాంటిది అని అన్నారు. నేను సినిమాలు ఎప్పటికీ వదలని నా ప్రియమైన స్నేహితులకు వాగ్దానం చేస్తున్నా. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రేక్షకుల ప్రేమకు నేను ఎంతో రుణపడి ఉంటాను. నా జీవితాంతం వారి పట్ల కృతజ్ఞతతో ఉంటానన్నాడు చిరంజీవి.