తైవాన్ నూతన అధ్యక్షుడిగా విలియమ్ లయి బాధ్యతలు స్వీకరించారు. తైపిలో ఉన్న ప్రెసిడెన్షియల్ ఆఫీసు బిల్డింగ్‌లో వేలాది మంది ప్రజల సమక్షంలో ప్రమాణ స్వీకారం జరిగింది. ప్రమాణస్వీకారోత్సవం తర్వాత మిలిటరీ మార్చ్‌నిర్వహించారు. ఫోక్ కళాకారులు కూడా ప్రదర్శన ఇచ్చారు. తైవాన్ జాతీయ జెండాతో మిలిటరీ హెలికాప్టర్లు ఫ్లా పాస్ట్ నిర్వహించాయి. ఈ ఏడాది జనవరిలో జరిగిన ఎన్నికల్లో ఆయన విక్టరీ సాధించారు. తమ దేశంపై సైనిక చర్యలను చైనా నిలిపివేయాలని ఆయన తన తొలి ప్రసంగంలో కోరారు. చైనా కవ్వింపు చర్యలు ప్రపంచ శాంతి, సుస్థిరతకు అతిపెద్ద సవాల్‌గా మారుతున్నట్లు ఆయన తెలిపారు.
అయితే తైవాన్ భూభాగం తమదే అని చైనా చెబుతున్న విషయం తెలిసిందే. ఆ దేశంపై పదేపదే చైనా తమ మిలిటరీ సత్తాను వాడుతోంది. తైవాన్‌లో వైభవోపేత ప్రజాస్వామ్యం ఆసన్నమైందని లయి తెలిపారు. ప్రజా స్వామ్యం, శాంతి, సౌభ్రాతృత్వం తైవాన్‌లో భాగమన్నారు. తమ దేశం మానవ హక్కుల సూచీలో మెరుగు సాధించిందన్నారు. తైవాన్‌పై రాజకీయంగా, మిలిటరీపరంగా బెదిరింపులు ఆపాలని చైనాను ఆయన కోరారు.