Namaste NRI

72వ మిస్ వరల్డ్ పోటీల విజేతలకు సత్కారం

మిస్ వరల్డ్ 2025 విజేత ఓపల్ సుచాట చుంగ్‌సీ తో పాటు ఇతర కేటగిరీల విజేతలకు రాష్ట్ర గవర్నర్ శ్రీ జిష్ణుదేవ్ వర్మ  రాజ్‌భవన్‌లో ఇచ్చిన తేనీటి విందుకు ముఖ్యఅతిథిగా ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి హాజరయ్యారు. 72వ మిస్ వరల్డ్ పోటీల విజేతలను గవర్నర్ దంపతులు, ముఖ్యమంత్రి  సత్కరించారు.

ఈ సందర్భంగా మిస్ వరల్డ్ పోటీల విజేతలు మాట్లాడుతూ, తెలంగాణ సాంస్కృతిక వైభవం తమను ఎంతో ఆకట్టుకున్నదని, తెలంగాణను చిరస్థాయిగా గుర్తుంచుకుంటామని చెప్పారు.

ఈ కార్యక్రమంలో మంత్రులు జూపల్లి కృష్ణారావు గారు, పొన్నం ప్రభాకర్ గారు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు గారు, ఇతర ఉన్నతాధికారులు, ఇతర ప్రముఖులు పాల్గొన్నారు.

Social Share Spread Message

Latest News