Namaste NRI

ఇస్కితడి ఉస్కితడి ‌తో.. అదరగొట్టేసిన ఉదయభాను

సత్యరాజ్‌ ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం త్రిబాణధారి బార్బరిక్‌. మారుతి సమర్పణలో వానర సెల్యులాయిడ్‌ పతాకంపై విజయ్‌పాల్‌ రెడ్డి నిర్మిస్తున్నారు. మోహన్‌శ్రీవత్స దర్శకుడు. ఈ సినిమాలో ఇస్కితడి ఉస్కితడి అంటూ సాగే ఐటెంసాంగ్‌ను ఇటీవల విడుదల చేశారు. ఇందులో ఉదయభాను నర్తించింది. రాహుల్‌ సిప్లిగంజ్‌ పాడిన ఈ పాటకు ఇంఫ్యూజన్‌ బ్యాండ్‌ సంగీతాన్నందించింది. హుషారైన బీట్‌తో ఈ పాట ఆకట్టుకునేలా ఉంది.

ఓ పౌరాణిక పాత్ర నేటికాలంలోకి వస్తే ఏం జరిగిందన్నదే చిత్ర కథాంశమని, ఆద్యంతం ఆసక్తికరంగా సాగుతుందని, త్వరలో విడుదల తేదీని ప్రకటిస్తామని చిత్రబృందం పేర్కొంది. సత్యంరాజేష్‌, వశిష్ట ఎన్‌ సింహ, సాంచి రాయ్‌ తదితరులు నటిస్తున్నారు.  ఈ చిత్రానికి సమర్పణ: మారుతి టీమ్‌ ప్రొడక్ట్‌, రచన-దర్శకత్వం: మోహన్‌శ్రీవత్స.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events