Namaste NRI

విత్ లవ్  టీజర్ విడుదల

అభిషన్ జీవింత్  హీరోగా నటిస్తున్న తాజా చిత్రం విత్ లవ్. ఈ సినిమాకు మ‌ద‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తుండ‌గా, మ‌ల‌యాళీ బ్యూటీ అన‌స్వ‌రా రాజ‌న్ క‌థానాయిక‌గా న‌టిస్తుంది. ప్రముఖ నటుడు రజనీకాంత్ కుమార్తె సౌందర్య రజనీకాంత్ ఈ సినిమాను నిర్మిస్తుంది. ఇప్ప‌టికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం వ‌చ్చే ఏడాది ఫిబ్ర‌వ‌రిలో ప్రేక్ష‌కుల ముందుకు రాబోతుంది. ఈ సంద‌ర్భంగా మూవీ నుంచి టైటిల్ టీజ‌ర్‌ను విడుద‌ల చేసింది చిత్ర‌బృందం. ఈ టీజ‌ర్ చూస్తుంటే ల‌వ్ బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమా రాబోతుంది. ఈ సినిమాకు సీన్ రోల్డాన్ సంగీతం అందిస్తుండగా, శ్రేయాస్ కృష్ణ సినిమాటోగ్రఫీ నిర్వహిస్తున్నారు. కావ్య అనిల్, స‌చిన్ నాచిప్ప‌న్‌, తేని మురుగ‌న్‌, శ‌ర‌వ‌ణ‌న్ త‌దిత‌రులు ఈ చిత్రంలో కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events