ఈ ఏడాది అమెరికాకు ఒక మహిళ అధ్యక్షురాలు అవుతారని రిపబ్లికన్ పార్టీ తరపున అధ్యక్ష అభ్యర్థిత్వానికి పోటీలో ఉన్న నిక్కీ హేలి వ్యాఖ్యానించారు. అధ్యక్ష పీఠంపై కూర్చొనేది నేను లేదా కమలా హారిస్ అని ఓ మీడియాతో మాట్లాడుతూ అన్నారు. రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిత్వం కోసం ట్రంప్‌తో పోటీపడుతున్న వారిలో నిక్కీ హేలి మాత్రమే నిలిచారు. నెవాడా, యూఎస్ వర్జిన్ ఐలాండ్స్ ప్రైమరీ ఎన్నికల్లో దక్కిన విజయంతో ట్రంప్ రేసులో దూసుకుపోతున్నారు. అయినప్పటికీ, తన పోరాటం కొనసాగుతుందని, వైట్‌హౌస్ రేసులో ఉంటానని హేలి పేర్కొన్నారు.
