అమెరికా ప్రధాన నగరం న్యూయార్క్ లో న్యూయార్క్ తెలంగాణ తెలుగు సంఘం (NYTTA) ఆధ్వర్యంలో మహాశివరాత్రి మరియు అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఘనంగా జరిగింది. శివరాత్రితో పాటు మహిళా దినోత్సవం రెండు వేడుకలను కలిపి నైటా సంబరాలను అద్వితీయంగా జరిపారు. న్యూయర్క్, న్యూజెర్సీతో పాటు పరిసర ప్రాంతాల్లో ఉన్న తెలుగువారందరూ పెద్ద సంఖ్యలో ఈ వేడుకల్లో పాల్గొన్నారు.


ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మ్యూజికల్ కన్సర్ట్ అందరినీ అలరించింది. భక్త కన్నప్ప స్కిట్, టీ&టీ సిస్టర్స్ నృత్య ప్రదర్శన, ఘర్షణ బ్యాండ్, అంజనా సౌమ్య, సృష్టి చిల్లాల ఫెర్మార్మెన్స్ లు ఆహుతులను ఆకట్టుకున్నాయి. చిన్నారులు ప్రదర్శించిన కళారూపాలు, వివిధ స్కిట్ లు ఆహా అనిపించాయి.
నైటా ఆధ్వర్యంలో నిర్వహించిన సాంస్కృతిక, సామాజిక కార్యక్రమాల సమాహారంతో రూపొందించిన ప్రత్యేక నైటా సంబరాల సావనీర్-2026ను ప్రముఖ ఎన్ఆర్ఐ వ్యాపారవేత్త, వితరణశీలి, సంస్థ శ్రేయోభిలాషి, డాక్టర్ పైళ్ల మల్లారెడ్డి చేతుల మీదుగా ఆవిష్కరించారు.


సంస్కృతీ సంప్రదాయాల కలబోతగా న్యూయార్క్ వేదికగా నైటా నిర్వహిస్తున్న కార్యక్రమాలను ప్రశంసిస్తూ ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పలువురు మంత్రులు, న్యూయార్క్ కాన్సులేట్ జనరల్, సింగ్రెస్ మన Tom Suozzi, నాస్సా కౌంటీ ఎగ్జిక్యూటివ్ Blakeman, ప్రత్యేక సందేశాలు పంపారు.
అమెరికాలో స్థిరపడినా, పుట్టిన ప్రాంత పండగలు, సంప్రదాయాలను గౌరవిస్తూ, ఇదేవిధంగా బృహతరంగా ముందు ముందు కొనసాగిస్తామని , వేడుకల విజయాన్ని ఆకాంక్షిస్తూ సహకరించిన కార్యవర్గానికి, దాతలకి, కామ్యూనిటీ అందరికీ నైటా అధ్యక్షుడు రవీందర్ కోడెల కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో నైటా కార్యకవర్గ సభ్యులు, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్, అడ్వయిజరీ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.


మొదటిసారిగా చినమ్మయీ డాన్స్ అకాడమీ మరియు నవత్మన్ అకాడమీ నుంచి NYTTA వేదిక పై పెర్ఫార్మన్సెస్ అహుతులని అక్కర్శించినవి. లోకల్ టాలెంట్ తో కార్యక్రమాలు మొదలు అయి వివిద డాన్స్ అకాడమిస్ నుంచి మంచి భారతనాట్యం, కూచిపూడి, కథక్, ఫిల్మ్య్ డాన్స్ లతో కార్యక్రమం అడగ్యంతం చాలా వైభవం గా జరిగింది. ఈ సందర్భంగా పద్మ కోడెల మరియు డెకొరేషన్ కమిటీ ఏర్పరిచిన డెకొరేషన్ సెట్ చూపరులను ఆకట్టుకున్నది.


ఘర్షణ బ్యాండ్, సింగర్స్ అంజన సౌమ్య, శ్రీష్టి చిల్లా, శైలేష్ ల ప్రదర్శన ప్రేక్షకులని మైమారిపించింది. చివరగా ప్రెసిడెంట్ రవీందర్ కోడెల మరియు చైర్మన్ రాజేందర్ రెడ్డి జిన్నా , కార్యక్రమానికి సహకరించిన కార్యవర్గానికి, దాతలు, శ్రేయోభిలాషులకు, మీడియామిత్రులకి, ప్రత్యేకముగా పార్టిసిపేంట్స్, టీచర్లు కి కృతజ్ఞతలు తెలియ చేయడం జరిగింది.


ఈ కార్యక్రమంలో వైస్ ప్రెసిడెంట్ హరిచరణ్ బొబ్బిలి, కోశాధికారి మహేష్ బాబు దోమల, Treasurer సౌమ్య శ్రీ చిట్టారి, జూన్ట్ సెక్రటరీ శ్రీవాణి రెడ్డి, జాయింట్ సెక్రటరీ రామానుజన్ రెడ్డి, EC Memebers, సుధీర్, రమేష్, భరత్, విజేందర్, నాగార్జున, కృష్ణ కాంత్, సతీష్ గార్లు ఎగ్జిక్యూటివ్ కమిటీ తరువునా, మరియు బోర్డు అఫ్ డైరెక్షర్స్, చైర్మన్ రాజేందర్ రెడ్డి జిన్నా, వైస్ చైర్మన్ Laxman Anugu, సెక్రటరీ సతీష్ కల్వ, ఉషా రెడ్డి, సహోదర్ రెడ్డీ, మల్లిక్ రెడ్డీ, కృష్ణ భాదే, శరత్ వేముగంటి, వేణు రెడ్డీ పళ్ళ, కల్పన రెడ్డీ, వాణి రెడ్డి అనుగు, సునీల్ రెడ్డీ గడ్డం, మరియు సలహాదారులు, శ్రీనివాస్ గూడూరు, చిన్న బాబు రెడ్డీ, మధుసూదన్ రెడ్డి, రమ వనమ పాల్గొనడం జరిగింది.
















