అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని చికాగో ఆంధ్ర సంఘం ఆధ్వర్యంలో స్థానిక నేషనల్ ఇండియా హబ్ లో ఘనంగా నిర్వహించారు. సంస్థ అధ్యక్షురాలు శ్వేత కొత్తపల్లి, చైర్మన్ శ్రీనివాస్ పెదమల్లు, ఉపాధ్యక్షులు శ్రీ కృష్ణ మతుకుమల్లి, గీతిక మండల, అనురాధ గంపాల, సౌమ్య బొజ్జల సమన్వయంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. పెద్దసంఖ్యలో చికాగో స్థానిక ప్రవాస మహిళలు హాజరయ్యారు. కృష్ణ జాస్తి, తమిశ్ర కొంచాడలు వేదికను అందంగా అలంకరించారు.

డా. సైని నర్‌వాదే, మాలతీ దామరాజులు వ్యాఖ్యాతలుగా వ్యవహరించగా దీపప్రజ్వలనతో కార్యక్రమం ప్రారంభమయింది. గణపతి ప్రార్థనా గీతం ఆలపించారు. ఫ్యాషన్ షో, వ్యర్థాలతో నగల రూపకల్పన, బొమ్మల అలంకరణ వంటి పోటీలు నిర్వహించారు. మహిళలు తమ కళానైపుణ్యాన్ని, సృజనాత్మకతను ఆవిష్కరించా రు. నిర్మ, అంబికా దర్బార్బత్తి వంటి ప్రకటనలకు అభినయించారు. విజేతలకు బహుమతు లను అందించారు. ఐదుగురు మహిళలకు చక్కని పట్టు చీరలు బహుకరించారు.

సుజాత అప్పలనేని, నరేశ్ చింతమాని, భోజన ఏర్పాట్లు పర్యవేక్షించారు. మయూరి సహకారంతో మహిళలు డ్యాన్స్ ఫ్లోర్‌పై ఉత్సాహంగా డ్యాన్స్ చేశారు. సంస్థ ధర్మకర్తలు డా. భార్గవి నెట్టెం, పవిత్ర కరుమూరి, డా. ఉమ కటికి, మల్లీశ్వరి పెదమల్లు, శివబాల జట్ల, సూర్య దాట్ల, అరుణ దాట్ల, సవిత మునగ, అనూష బెస్త, శైలజ సప్ప, శ్రీ స్మిత నండూరి, అన్వితా పంచాగ్నుల, మురళీ రెడ్డివారి, పద్మారావు అప్పలనేని, నరసింహరావు వీరపనేని, ప్రభాకర్ మల్లంపల్లి, గిరి రావు కొత్తమాసు, మనస్వి తూము, కావ్య శ్రీ చల్ల తదితరులు పాల్గొన్నారు.














