అమెరికాలోని ప్రముఖ ప్రవాస భారతీయ సంస్థ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ అసోసియేషన్స్ (ఎఫ్ఐఏ) న్యూయార్క్, న్యూజెర్సీ, కనెక్టికట్, న్యూఇంగ్లాండ్ చాఫ్టర్ల ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను ఇండియా హౌస్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వ్యాపారం, మీడియా, ఆర్థికం మరియు సామాజిక వ్యవస్థాపకత వంటి వివిధ రంగాలలో వారి అద్భుతమైన విజయాల ద్వారా అన్ని అడ్డంకులను అధిగమించి అమెరికాలోని వారికి స్ఫూర్తినిచ్చిన భారత సంతతి మహిళల నుండి ప్రతిభావంతులైన వారిని గుర్తించి, సత్కరిస్తారు.

ఎఫ్ఐఏ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన శ్రీకాంత్ అక్కపల్లి మాట్లాడుతూ, మహిళా నాయకత్వానికి తమ సంస్థ ఇస్తున్న మద్దతును వివరించారు. సమాజంలో మహిళలు తీసుకొచ్చిన సానుకూల మార్పులకు కతజ్ఞతలు తెలుపుతూ అవార్డు గ్రహీతలను అభినందించారు. ఈ సందర్భంగా ఆయన భారత కాన్సుల్ జనరల్ బినయ శ్రీకాంత్ ప్రధాన్‌ను ప్రత్యేక అతిథిగా పరిచయం చేశారు. దేశ అభివృద్ధి కి మహిళా సాధికారత కీలకమని కాన్సల్ జనరల్ బినయ శ్రీకాంత ప్రధాన్ అన్నారు. దాదాపు 100 మిలియన్ల కుటుంబాలను 9 మిలియన్ల మహిళా స్వయం సహాయక బృందాలతో అనుసంధానం చేయడం ద్వారా జరుగుతున్న ఆర్థిక విప్లవాన్ని ఆయన ప్రస్తావించారు. మహిళలు నాయకత్వ బాధ్యతలు చేపట్టడం జాతీయ పురోగతికి అంతర్భాగమని ఆయన స్పష్టం చేశారు.


ఈ కార్యక్రమంలో సత్కారం పొందిన మహిళలకు న్యూయార్క్ గవర్నర్ కాథీ హోచుల్ తరపున శాలువాలు, ట్రోఫీలు అందజేశారు. నార్త్‌స్టార్ స్ట్రాటజీస్ సీవోవో జోడి లిన్ హెర్కోజ్, రోబర్ట్ వుడ్ జాన్సన్ బార్నబాస్ హెల్త్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ బల్ప్రీత్ గ్రేవాల్ విర్క్, ప్రముఖ అమెరికన్ నటి రేష్మా శెట్టి, ఎన్‌వైపీడీ ఫస్ట్ డిప్యూటీ కమిషనర్ టానియా కిన్సెల్లా తదితరులు మహిళలు ఒకరినొకరు ప్రోత్సహించుకోవాలని పిలుపునిచ్చారు. అవార్డు గ్రహీత దివంగత రాధా సుబ్రహ్మణ్యాన్ని గుర్తు చేసుకుంటూ కాసేపు మౌనం పాటించారు. రిద్ది పారిఖ్ పటేల్ వ్యాఖ్యాతగా వ్యవహరించగా, ఎఫఐఏ ప్రధాన కార్యదర్శి సష్టి కౌల్‌ఖ నరులా, జనరల్ సెక్రటరీ సృష్టి కౌల్ నరుల ధన్యవాదాలు తెలిపారు.















