Namaste NRI

7 ఏళ్లకే ప్రపంచ రికార్డు …అరేబియా సముద్రంలో

మహారాష్ట్రలోని థాణెకు చెందిన ఏడేండ్ల రేయాన్ష్‌ ఖంకర్‌ ఒంటరిగా అరేబియా సముద్రంలో 30 కి.మీ ఈదాడు. ఈ ఘనత సాధించిన అతిచిన్న వయస్కుడైన భారతీయడిగా లండన్‌కు చెందిన వరల్డ్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో స్థానం పొందాడు. అభినందన సభలో థాణె నగర మేయర్‌ షర్మిలా పింపలోల్కర్‌ మాట్లాడుతూ గత ఏడాది నవంబర్‌ 15న సింధుదుర్గ్‌కు చెందిన రేయాన్ష్‌ మలాపె జెట్టీ నుంచి విజయ్‌దుర్గ్‌ వరకు 30 కి.మీ దూరాన్ని ఏడు గంటల, 11 నిమిషాల, 11 సెకండ్లలో ఈదాడని చెప్పారు. ఈ ఘనత సాధించిన అతి పిన్న వయస్కుడిగా రేయాన్ష్‌ రికార్డు సాధించాడన్నారు. లండన్‌, వరల్డ్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌ అతనికి సర్టిఫికెట్‌ ప్రదానం చేసిందని చెప్పారు.


Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events