అమెరికాలో తుపాకీ సంస్కృతి పేట్రెగిపోతుంది. చికాగో లో దారుణం జరిగింది. రోమియోవిల్లే ప్రాంతంలో ఉన్న ఓ ఇంట్లోని భార్యాభర్తల్ని, వారి ఇద్దరి పిల్లల్ని, ఆ ఇంట్లో ఉన్న మూడు కుక్కలను కూడా కాల్చి చంపారు. ఈ ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. ఆ జంటను ఆల్బర్టో రోలన్, జొరైడా బర్టోలెమిగా గుర్తించారు. వాళ్ల పిల్లలు పదేళ్ల ఆడ్రియల్, ఏడేళ్ల డీగో కూడా మరణించారు. ఆ ఇంట్లో ఉంటున్న మూడు శునకాలను కూడా కాల్చి చంపారు. దీన్ని మర్డర్-సూసైడ్‌గా భావించడం లేదని రోమియోవిల్లే పోలీసులు తెలిపారు. ఈ కేసును ప్రస్తుతం కేవలం మర్డర్ కోణంలో మాత్రమే విచారిస్తున్నట్లు పోలీసులు చెప్పారు. ఈ కేసుకు సంబంధించి ఎటువంటి అరెస్టు జరగలేదు. ఇంటి యజమాని పనికి వెళ్లకపోవడంతో అతనికి అనేకసార్లు ఫోన్ చేశారు, ఫోన్ రిప్లై ఇవ్వకపోడంతో ఓ బంధువు ఆ ఇంటికి వెళ్లాడు. అప్పుడు ఈ ఘటన బయటపడింది. ఆ ఇద్దరు పిల్లలు రాబర్ట్ సీ హిల్ ఎలిమెంటరీ స్కూల్‌లో చదువుకుంటున్నారు.
