Namaste NRI

ఆస్కార్ బరిలో రైటింగ్ విత్ ఫైర్

ఆస్కార్‌ అకాడమీ 2022 అవార్డులకు చెందిన షార్ట్‌లిస్టును ప్రకటించింది. డిసెంబర్‌ 15వ తేదీన ఓటింగ్‌ నిర్వహించారు. భారతీయ డాక్యుమెంటరీ చిత్రం రైటింగ్‌ విత్‌ ఫైర్‌ ప్రతిష్టాత్మక ఆస్కార్‌ పురస్కారాల పోటీ నిలిచింది. డాక్యుమెంటరీ ఫీచర్‌ ఫిల్మ్‌ కేటగిరిలో తుది పదిహేను సినిమాల జాబితాలో ఈ చిత్రం చోటు దక్కించుకున్నది. దేశంలో దళిత మహిళలు నిర్వహిస్తున్న ఏకైక వార్త పత్రిక నేపథ్యంలో వాస్తవ ఘటనల స్ఫూర్తితో సుస్మితఘోష్‌, రింటు థామస్‌ ఈ డాక్యుమెంటరీని తెరకెక్కించారు. సమాజంలోని కుల వివక్ష, పురుషాధిక్యతను ఎదుర్కొంటూ పాత్రికేయ వృతిలో కొందరూ మహిళలు ఎలా రాణించారు? ఆధునిక సాంకేతికతలో ప్రావీణ్యం లేని వారు డిజిటల్‌ మీడియాలో ఎలా ప్రతిభను చాటుకున్నారో స్ఫూర్తిదాయకంగా ఇందులో ఆవిష్కరించారు.

                         సునీతా ప్రజాపతి, మీరాదేవి కీలక పాత్రల్లో నటించిన ఈ  ఈ డాక్యుమెంటరీ ఈ ఏడాది జనవరిలో విడుదలైంది. డాక్యుమెంటరీ ఫీచర్‌ ఫిల్మ్‌ కేటగిరిలో వివిధ దేశాల నుంచి 138 చిత్రాలు పోటీపడగా వాటిలో నుంచి పదిహేను సినిమాల్ని షార్ట్‌లిస్ట్‌ చేశారు. అందులో రైటింగ్‌ విత్‌ ఫైర్‌ ఒకటిగా నిలిచింది. తదుపరి రౌండ్‌లో ఈ సినిమా ఎంపికైతే ఆస్కార్‌కు గట్టిపోటీదారుగా నిలిచే అవకాశముంది. అయితే ఫీచర్‌ ఫిల్మ్‌ క్యాటగిరిలో ఆస్కార్స్‌కు వెళ్లిన కూజగల్‌ రేస్‌ నుంచి తప్పుకున్నది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 8న తుది నామినీలను ప్రకటిస్తారు. మార్చి 27న 94వ ఆస్కార్‌ అకాడమీ అవార్డులు ప్రదానం చేస్తారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events