Namaste NRI

రాంగ్‌ నంబర్‌  ట్రైలర్‌ విడుదల

మారుతి రామ్‌, జియో డార్ల, హాసిని జంటగా సాంబశివరావు తెరకెక్కించిన చిత్రం రాంగ్‌ నంబర్‌.  అజయ్‌ ఘోష్‌ కీలక పాత్రలో నటించారు. ఈ చిత్ర ట్రైలర్‌ను హైదరాబాద్‌లో విడుదల చేశారు. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ క్రైమ్‌ థ్రిల్లర్‌  కథాంశంతో రూపొందిన చిత్రమిది. నిర్మాతలు ఖర్చుకు వెనకాడకుండా నిర్మించారు. అందరు ట్రైలర్‌ బాగుందని మెచ్చుకుంటున్నారు. ట్రైలర్‌ కంటే సినిమా పదిరెట్లు బాగుంటుంది. మంచి కాన్సెప్ట్‌తో వస్తున్న ఈ చిత్రం కచ్చితంగా ప్రేక్షకులకు నచ్చుతుందని ఆశిస్తున్నా అన్నారు. హీరో కొత్త వాడైనా అనుభవమున్న వాడిలా నటించాడు. దర్శకుడు సినిమాని అద్భుతంగా తెరకెక్కించారు. త్వరలో విడుదల తేదీ ప్రకటిస్తాం అన్నారు నిర్మాత ఆర్‌.వి.యస్‌రావు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ సినిమా డిస్ట్రిబ్యూటర్స్‌ నచ్చడంతో వారు ఈ సినిమాను థియేటర్స్‌లలో విడుదల చేయడానికి ముందుకు వచ్చారు వారందరికి ధన్యవాదాలు.  త్వరలో ప్రేక్షకుల ముందుకు వస్తున్న మా సినిమా ప్రేక్షకులందరూ ఆదరించి ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు. ఈ చిత్రాన్ని ఆర్‌.వి.యస్‌ రావు, ఫనా సంయుక్తంగా నిర్మించారు. శ్రీరాములు, తిలక్‌ గంగాధర్‌ యాదవ్‌, దామోదర్‌ తదితరులు పాల్గొన్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events