చైనా అధ్యక్షుడిగా జీ జిన్‌పింగ్ మూడవసారి ఏకపక్షంగా ఎన్నికయ్యారు. సెంట్రల్ మిలిటరీ కమీషన్ చైర్మెన్‌గా కూడా ఆయన ఎన్నికయ్యారు. బీజింగ్‌లో 14వ నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్ పార్టీ సమావేశాల్లో ఆయన్ను ఏకగ్రీవంగా దేశాధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. మూడవ సారి దేశాధ్యక్షుడిగా ఎన్నికైన జీ జిన్పింగ్ బీజింగ్‌లోని గ్రేట్ హాల్ ఆఫ్ పీపుల్ లో రాజ్యాంగం మీద ప్రమాణం చేశారు. 69 ఏళ్ల జీ జిన్‌పింగ్ మరో అయిదేళ్ల పాటు దేశాధ్యక్షుడిగా కొనసాగనున్నారు. స్టాండింగ్ కమిటీ చైర్మెన్‌గా ఎన్నికైన జావో లెజితో పాటు ఉపాధ్యక్షుడు హాన్ జంగ్ కూడా రాజ్యాంగం మీద ప్రమాణం చేశారు. గత ఏడాది అక్టోబర్‌లో చైనీస్ కమ్యూనిస్టు పార్టీ నేతగా నియమితులైన విషయం తెలిసిందే. ఇవాళ జరిగిన సమావేశంలో 2,952 ఓట్లు ఏకగ్రీవంగా జిన్‌పింగ్‌కు పోలయ్యాయి.