Namaste NRI

అవును మేము విడిపోతున్నాం : నాగచైతన్య, సమంత

టాలీవుడ్‌ రూమర్స్‌కు బ్రేక్‌ పడిరది. యంగ్‌ హీరో నాగ చైతన్య, సమంతలు వివాహ బంధానికి పుల్‌స్టాప్‌ పెట్టేశారు. మొగుడు పెళ్లాలుగా విడిపోతున్నట్లు ఇద్దరూ ప్రకటించారు. ట్విటర్‌ వేదికగా తమ డ్రైవర్స్‌ స్టేట్మెంట్‌ను రిలీజ్‌ చేశారు. ఇద్దరం ఒకరికి ఒకరు దూరం ఉండాలనుకుంటున్నట్లు వెల్లడిరచారు. సమంతతో సంప్రదింపుల తర్వాత ఇద్దరం వేరుగా ఉండాలని నిర్ణయించుకున్నామని నాగ చైతన్య తన ట్వీట్‌లో తెలిపారు. తమ కెరీర్‌లపై దృష్టి పెట్టాలనుకుంటున్నట్లు నాగ్‌ తెలిపారు. దాదాపు దశాబ్ధ కాలం పాటు తమ మధ్య స్నేహం కొనసాగిందని, అదే తమ మధ్య బంధాన్ని బలపరిచినట్లు చైతన్య తెలిపాడు. అది ఎప్పటికీ మరువలేనిదన్నాడు. క్లిష్ట తరమైన సమయంలో అభిమానులు, మిత్రులు, శ్రేయోభిలాషులు, మీడియా సహకరించాలని చైతూ తన ట్వీట్‌లో కోరారు. తమకు ప్రైవసీ ఇవ్వాలని వేడుకున్నాడు. సమంత కూడా తన ట్విట్టర్‌లో చైతుతో విడిపోతున్నట్లు స్పష్టం చేసింది.

                కాగా, నాగచైతన్య, సమంత విడాకులు తీసుకున్నట్లు గత కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ విషయంపై ఇప్పటి వరకు స్పందించని  ఈ జంట తాజాగా సోషల్‌ మీడియా వేదికగా విడాకుల విషయాన్ని వెల్లడిరచారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events