తెలంగాణ వ్యాప్తంగా అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. హైదరాబాద్ నగరంలోని గచ్చిబౌలి స్టేడియం, సికింద్రాబాద్, ఓయూ కళాశాల ఆవరణలో యోగా డే వేడుకలు నిర్వహించారు. గచ్చిబౌలి స్టేడియంలో యోగా కార్యక్రమానికి తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, మంత్రులు దామోదర రాజనర్సింహ, వాకిటి శ్రీహరి, సీఎస్ రామకృష్ణారావు హాజరయ్యారు. ప్రజలకు యోగా విశిష్ఠతను వివరించారు. నగరవాసులు పెద్దఎత్తున పాల్గొని ఉత్సాహంగా యోగాసనాలు వేశారు.


ఎల్బీస్టేడియంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో యోగా డే 24 గంటల కౌంట్ డౌన్ ఈవెంట్ ను నిర్వహించారు. తెలంగాణ గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు తదితరులు ఈ ఈవెంట్ లో పాల్గొన్నారు.నగరం నలుమూలల నుంచి ఈ ఈవెంట్ లో పాల్గొనేందుకు హైదరాబాదీలు తరలివచ్చారు. 21న కేంద్ర గనులు, మైనింగ్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించే ఈ ఈవెంట్ లో యోగా శిక్షణ ఇచ్చారు.
