Namaste NRI

దక్షిణ కొరియా నూతన అధ్యక్షుడిగా యూన్ సుక్ యోల్

 దక్షిణ కొరియా దేశాధ్యక్షుడిగా కన్జర్వేటివ్‌ నతే యూన్‌ సుక్‌ యోల్‌ బాధ్యతలు స్వీకరించారు. ఆయన అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేశారు. మాజీ న్యాయవాది అయిన యూఎస్‌ మార్చిలో జరిగిన ఎన్నికల్లో విజయం సాధించారు. కొత్తగా బాధ్యతలు స్వీకరించిన యూన్‌ సుక్‌ ఉత్తర కొరియాతో సమస్యను పరిష్కరించనున్నట్లు తెలిపారు. 61  ఏళ్ల యూన్‌ తన స్క్రీప్ట్‌ను తానే రాసుకుంటున్నారు. ఫ్రీడమ్‌, మార్కెట్‌, ఫెయిర్‌నెస్‌ అంశాలపై ఆయన ప్రసంగించారు. ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి సుమారు 40 వేల మంది గెస్ట్‌లను ఆహ్వానించారు. చైనా ఉపాధ్యక్షుడు వాంగ్‌ కిషాన్‌, జపాన్‌ విదేశాంగ మంత్రి యోషిమాష హయసీ, అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌ భర్త డగ్‌ ఎమాప్‌లు ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరయ్యారు. 26 లక్షల డాలర్ల ఖర్చుతో ప్రమాణ స్వీకారోత్సవం నిర్వహించారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events