Namaste NRI

మీరు మా దేశ పౌరులు కాదు.. మీ పౌరసత్వాన్ని రద్దు చేస్తున్నాం

ఈ రోజు నుంచి మీరు మా దేశ పౌరులు కాదు. మీ పౌరసత్వాన్ని రద్దు చేస్తున్నాం  అంటూ కువైట్‌ ప్రభుత్వం వేలాది మందికి షాకిచ్చింది. ఇలా షాక్‌ తిన్న వారిలో 20 ఏండ్లుగా ఆ దేశంలో నివసిస్తున్న వారు, పలువురు నటులు, సెలబ్రిటీలు కూడా ఉన్నారు. పౌరసత్వ రద్దు బాధితులలో ఎక్కువగా మహిళలు ఉన్నారు. పదులు, వందలు కాదు ఏకంగా 37 వేల మందిపై కువైట్‌ దేశ బహిష్కరణ వేటు వేసింది.

ఆగస్టు నుంచి జరుగుతున్న ఈ ప్రక్రియలో జాతీయతను కోల్పోయిన వారిలో 26 వేల మంది మహిళలు ఉన్నారని, వీరంతా వివాహం ద్వారా పౌరసత్వ హక్కు పొందిన వారని, బహిష్కరణకు గురైన వారి సంఖ్య ఇంకా ఎక్కువగా ఉండవచ్చునని స్థానిక మీడియా వర్గాలు తెలిపాయి. అలాగే ద్వంద్వ, అక్రమ మార్గాల్లో పొందిన పౌరసత్వాలను కూడా ప్రభుత్వం రద్దు చేసింది.

Social Share Spread Message

Latest News