అణు కార్యక్రమానికి సంబంధించి ఇరాన్ తప్పనిసరిగా తమతో ఒప్పందం చేసుకోవాల్సిందేనని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు. లేదంటే పరిస్థితులు మరింత దిగజారుతాయని హెచ్చరించారు. ఇప్పటికే పశ్చిమా సియా లో సైన్యాన్ని మోహరిస్తున్నామని, ఒప్పందం చేసుకోలేదంటే దీన్ని మరింత ముందుకు వెళ్తామన్నారు. బోర్డ్ ఆఫ్ పీస్ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, మరో 10 రోజుల్లో దాని ఫలితాన్ని మీరే చూస్తారని ఇరాన్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.

భారత్-పాక్‌ల మధ్య సైనిక ఉద్రిక్తతలను తగ్గించడంలో తన కృషి ఉందని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మరోసారి పేర్కొన్నారు. ఘర్షణలు ఉద్ధతంగా కొనసాగుతున్న వేళ ఇరు దేశాధినేతలతో ఫోన్‌లో మాట్లాడానని చెప్పారు. ఈ సమస్యను పరిష్కరించుకోకపోతే వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోనని వారికి స్పష్టం చేశానని, 200శాతం సుంకాలు విధిస్తానంటూ బెదిరించినట్లు తెలిపారు. ఈ యుద్ధం ఆపడం ద్వారా 2.5కోట్ల మంది ప్రాణాలను రక్షించారని పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ తనతో చెప్పారని అన్నారు. ప్రధాని మోడీ బాగా తెలుసునని, ఆయన గొప్ప వ్యక్తి అని ట్రంప్ పేర్కొన్నారు.















