అధునాతన టెక్నాలజీలపై మరింత విశ్వాసంతో భారత్, అమెరికా కలిసి పని చేస్తున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్, విదేశాంగ మంత్రి ఆంటోని బ్లింకెన్ మోదీ గౌరవార్థం విందు ఇచ్చారు. శ్వేతసౌధంలోనే ఈ విందు కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ రెండు దేశాలు విస్తృత ప్రాతిపదికన రక్షణ, వ్యూహాత్మక రంగాల్లో సహకారం అందించుకోనున్నాయని తెలిపారు. తనకు ఆతిథ్యమిచ్చిన అమెరికా నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.భారత సంతతికి చెందిన కమలా హారిస్‌పై ప్రశంసలు కురిపించారు. భారత్, అమెరికా సంబంధాలను బలోపేతం చేయడంలో మీ కృషి అపారం. రెండు దేశాల ప్రజలమధ్య సంబంధాల ఆధారంగా నిర్మితమైన తీయని బంధమే ఇది అని పేర్కొన్నారు.