Namaste NRI

ఇలాంటి సినిమా మీరెప్పుడు చూసుండరు..ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌

రాజాకృష్ణ ప్రొడక్షన్స్‌ బ్యానర్‌ పై నిర్మించిన తాజా చిత్రం ఇలాంటి సినిమా మీరెప్పుడు చూసుండరు. తెలుగులోనే కాదు ప్రపంచ సినిమా చరిత్రలోనే ఎవరు చేయని విధంగా ఒకే షాట్‌లో సినిమా మొత్తాన్ని తెరకెక్కించారు. ఈ చిత్ర ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా హీరో సూపర్‌ రాజా మాట్లాడుతూ క్రియేటివిటీనే బ్యాక్‌గ్రౌండ్‌, కసే బలం ఈ రెండు ఆయుధాలతో సినిమా పరిశ్రమలో అద్భుతాలు చేయొచ్చు. గివ్‌ అప్‌ చేయకుండా ప్రయత్నిస్తే ఒక మనిషి ఏం చేయగలడో ఈనెల 19న థియేటర్లో చూస్తారు. సినిమా ఇంత అద్భుతంగా రావడానికి కారణం మా పేరెంట్స్‌. ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్‌ రావడం ఆనందంగా ఉంది. ఎన్నో రోజులు చీకట్లో ఉండి వెలుగు కోసం ప్రయత్నం చేశాను. ఈ ప్రయత్నం ఎంతో మంది జీవితాల్లో వెలుగు నింపుతుందనే నమ్మకం ఉంది. నన్ను నమ్మి డబ్బులు పెట్టిన నా పేరెంట్స్‌, అన్నయ్యకు, నటీనటులకు, డిస్ట్రీబ్యూట్‌ చేస్తున్న మైత్రీ వాళ్లకు, ఈవెంట్‌కు చీఫ్‌ గెస్ట్‌గా వచ్చిన అభిమానులకు స్పెషల్‌ థ్యాంక్స్‌ అని అన్నారు.

ఈ సినిమాలో నటించడం చాలా స్పెషల్‌గా ఫీల్‌ అవుతున్నాను అని అని హీరోయిన్‌ చందన పాలంకి తెలిపారు. మైత్రి డిస్ట్రిబ్యూటర్‌ శశిధర్‌ మాట్లాడుతూ సింగిల్‌ టేక్‌లో ఈ సినిమా ఎలా చేశారు అనే ఆశ్చర్యం వేసింది. సూపర్‌ రాజా ఎఫర్ట్‌కి, క్రియేటివిటీకీ హ్యాట్సాఫ్‌. ఈ సినిమా కచ్చితంగా ప్రేక్షకులకు విపరీతంగా నచ్చుతుంది అని అన్నారు.  ఈ చిత్రానికి బ్యానర్ : రాజాకృష్ణ ప్రొడక్షన్స్, నటీనటులు: సూపర్ రాజా, రమ్య ప్రియ, వంశీ గోనె తదితరులు, దర్శకుడు: సూపర్ రాజా, నిర్మాత: సూపర్ రాజా , మ్యూజిక్ డైరెక్టర్: సబు వర్గీస్, గ్రాఫిక్స్: శ్యామ్ వనం.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events