Namaste NRI

కాంగ్రెస్‌ పార్టీలో చేరిన వైఎస్‌ షర్మిల

వైఎస్సార్‌ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. న్యూఢిల్లీలోని పార్టీ కార్యాలయంలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్‌ గాంధీ సమక్షంలో కాంగ్రెస్‌ కండువా కప్పుకున్నారు. అనంతరం షర్మిల మాట్లాడుతూ వైఎస్‌ఆర్‌ తెలంగాణ పార్టీని కాంగ్రెస్‌ పార్టీలో విలీనం చేయడం తనకు చాలా సంతోషంగా ఉన్నారు.  కాంగ్రెస్‌ నా తండ్రి పని చేసిన పార్టీ. ఆయన మనుగడ సాగించిన పార్టీ. ఆయన నిరంతరాయం సేవ చేసిన పార్టీ. ఆయన తుదిశ్వాస విడిచిన పార్టీ. ఈ క్షణం ఆయనను ఉప్పొంగేలా చేస్తుంది. సొంతింటికి రావడం కంటే ఇంకేది ఎక్కువ కాదు  తెలిపారు. రాహుల్‌ గాంధీని ప్రధానమంత్రిగా చూడాలన్నది తన తండ్రి కల అని, దీన్ని సాధించేందుకు తాను కష్టపడి పనిచేస్తానని షర్మిల వ్యాఖ్యానించారు.

Social Share Spread Message

Latest News