ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోదిమిర్ జెలెన్స్‌కీ కీలక వ్యాఖ్యలు చేశారు. స్వాతంత్య్ర దినోత్సవం నాడు రష్యా దాడులు మరింత తీవ్రతరం అయ్యే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. సోవియట్ పాలన నుంచి స్వాతంత్య్ర వచ్చి 31 ఏళ్లయిన సందర్భంగా ఈ నెల 2న జరుగన్ను ఈ వేడుకలపై రష్యా మరింత క్రూరమైన దారుణమైన దాడులు చేయొచ్చని జెలెన్స్‌కీ తెలిపారు. తమ దేశంలో రష్యా మరింత విధ్వంసాన్ని భయాన్ని పెంపొందించకుండా ఉక్రేనియన్లు అడ్డుకోవాలని సూచించారు. ఈ క్రమంలోనే ఉక్రెయిన్‌లో రెండో అతిపెద్ద నగరమైన ఖర్కీవ్‌లో పూర్తిగా కర్ఫ్యూ విధిస్తున్నట్లు తెలిపారు.