
ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్‌స్కీ షాకింగ్ కామెంట్స్ చేశారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ త్వరలోనే మరణిస్తాడంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన మరణంతో రష్యా- ఉక్రెయిన్ యుద్ధం కూడా ముగుస్తుందంటూ వ్యాఖ్యానించారు. పారిస్‌లో ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మెక్రాన్‌తో సమావేశం అనంతరం జెలెన్‌స్కీ మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. అతను (పుతిన్‌ను ఉద్దేశిస్తూ) త్వరలో చనిపోతాడు. ఇది నిజం. ఆయన మరణంతో రెండు దేశాల మధ్య యుద్ధం ముగుస్తుంది అని విలేకరులతో జెలెన్‌స్కీ అన్నారు. పుతిన్ తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారంటూ గతకొంత కాలంగా ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ ప్రచారం నేపథ్యంలో జెలెన్ స్కీ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
