Namaste NRI

న్యూయార్క్ మేయ‌ర్‌గా జోహ్రాన్ మామ్‌దానీ ప్ర‌మాణ స్వీకారం

అమెరికాలోని న్యూయార్క్ సిటీ మేయ‌ర్‌గా జోహ్రాన్ మామ్‌దానీ ప్ర‌మాణ స్వీకారం చేశారు. చ‌రిత్రాత్మ‌క‌మైన మ‌న్‌హ‌ట్ట‌న్ స‌బ్‌వే స్టేష‌న్ వ‌ద్ద ప్ర‌మాణ స్వీకారం చేశారు. ఖురాన్ గ్రంధంపై చేయి వేసి ఆయ‌న ప్ర‌మాణం చేశారు. మేయ‌ర్‌గా ప్ర‌మాణ స్వీకారం చేప‌ట్ట‌డాన్ని గౌర‌వంగా, జీవిత‌కాల అవ‌కాశంగా భావిస్తున్న‌ట్లు మామ్‌దానీ తెలిపారు. న్యూయార్క్ అటార్నీ జ‌న‌ర‌ల్ లెటిటా జేమ్స్ ప్ర‌మాణం చేయించారు. న్యూయార్క్ సిటీకి తొలి ముస్లిం మేయ‌ర్‌గా మామ్‌దానీ నిలిచారు. ఓల్డ్ సిటీ హాల్ స‌బ్‌వే స్టేష‌న్ వ‌ద్ద ప్ర‌మాణ‌స్వీకార కార్య‌క్ర‌మం జ‌ర‌గ‌డం గ‌మ‌నార్హం. భార‌తీయ మూలాలు ఉన్న మామ్‌దానీ ఆఫ్రికాలో జ‌న్మించారు. న్యూయార్క్ సిటీకి మేయ‌ర్‌గా అతిపిన్న వ‌య‌స్కుడిగా రికార్డు క్రియేట్ చేశారు. మామ్‌దానీ వ‌య‌సు 34 ఏళ్లు. ఫ్రీ చైల్డ్‌కేర్, ఫ్రీ బ‌స్సులు లాంటి ఎన్నిక‌ల హామీలు చేశారాయ‌న‌.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events