మెటా కంపెనీ సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ మూడో సంపన్న వ్యక్తిగా నిలిచారు. టెస్లా కంపెనీ చీఫ్ ఎలాన్ మస్క్‌ను వెనక్కినెట్టి మూడోస్థానానికి చేరుకున్నారు. మార్చి మొదట్లో బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్‌లో మొదటి స్థానంలో ఉన్న ఎలాన్ మస్క్, నాలుగో స్థానానికి పడిపోయాడు. ఈ ఏడాది మస్క్ సంపద 48.4 బిలియన్ డాలర్లు తగ్గగా, జుకర్ బర్గ్ సంపద 58.9 డాలర్లకు పెరిగింది. మెటా షేర్లు గరిష్ఠానికి చేరాయి. నవంబర్ 16, 2020 తర్వాత బ్లూమ్‌బెర్గ్ సంపన్నుల ర్యాంకింగ్‌లో మొదటి మూడు స్థానాల్లో జుకర్‌బర్గ్ కనిపించడం ఇదే మొదటిసారి. మార్క్ జుకర్‌బర్గ్ సంపద ప్రస్తుతం 187 బిలియన్ డాలర్లు కాగా.. ఎలాన్ మస్క్ సంపద 181 బిలియన్లుగా ఉన్నది.