ప్రముఖ సామాజికమాధ్యమం ఫేస్ బుక్ ఫౌండర్, మెటా సీఈవో మార్క్ జుకర్ బర్గ్ 11 ఏళ్ల తర్వాత మళ్లీ ట్విట్టర్ లోకి రీ ఎంట్రీ ఇచ్చారు. ట్విట్టర్ కు పోటీగా థ్రెడ్స్ యాప్ ను తీసుకొచ్చిన సందర్భంగా జుకర్ బర్గ్ ట్విట్టర్ లో ఓ ఫొటో షేర్ చేశారు. స్పైడర్ మ్యాన్ దుస్తులు ధరించిన వ్యకి అదే దుస్తులు ధరించిన మరొక వ్యక్తిని చూపుతున్నట్టు ఉన్న చిత్రాన్ని షేర్ చేశారు. ఇది 1967లో వచ్చిన స్పైడర్ మ్యాన్ కార్టూన్ డబుల్ ఐడెంటిటీ లోనిది. విలన్ హీరోగా కనిపించేందుకు ప్రయత్నించేలా ఆ చిత్రం ఉంది. అయితే కేవలం కార్టూన్ ఫొటోను మాత్రమే షేర్ చేసిన జుకర్ బర్గ్, దానికి ఎలాంటి క్యాప్షన్ ఇవ్వలేదు. ట్విట్టర్ అధినేత మస్క్ ను ఉద్దేశించే ఆయన ఈ పోస్ట్ షేర్ చేసినట్లు తెలుస్తోంది.


