ఉత్తర అమెరికాలోని పెన్సిల్వేనియా రాష్ట్రం, నారిస్ టౌన్ లో జూన్ 10వ తేదీన అశేష అభిమాన కథానాయకుడు, నిర్మాత, శాసనసభ సభ్యులు, బసవతారకం కాన్సర్ హాస్పిటల్ చైర్మన్ గౌరవనీయులు శ్రీ నందమూరి బాలకృష్ణ గారి జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలో కేక్ కట్ చేసి బాలకృష్ణ గారి “భగవంత్ కేసరి” చిత్రం ట్రైలర్ ప్రదర్శించారు. ఈ సందర్భంగా వేడుక మొత్తం జై బాలయ్య జై బాలయ్య ప్రతిధ్వనులతో నందమూరి అభిమానులు హోరేటించారు.
ఈ కార్యక్రమంలో తానా అధ్యక్షులు అంజయ్య చౌదరి లావు, తానా 23వ మహాసభల సమన్వయకర్త రవి పొట్లూరి, రవి మందలపు, సతీష్ తుమ్మల, వంశి కోట, లక్ష్మి దేవినేని, జానీ నిమ్మలపూడి, శ్రీనివాస్ ఓరుగంటి, సతీష్ మేక, సతీష్ చుండ్రు, రాజా కసుకుర్తి, సునీల్ కోగంటి, సాయి బొల్లినేని, శ్రీనాథ్ కోనంకి, కిరణ్ కొత్తపల్లి, సత్య పొన్నగంటి తదితరులు పాల్గొన్నారు.