హరీశ్‌శంకర్ దర్శకత్వంలో పవన్‌కల్యాణ్ కథానాయకుడిగా నటించిన బ్లాక్‌బస్టర్ హిట్ గబ్బర్‌సింగ్ ఈ నెల 2న రీరిలీజ్ కానుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో చిత్ర దర్శకుడు హరీశ్‌శంకర్, నిర్మాత బండ్ల గణేష్ పాల్గొన్నారు. హరీశ్‌శంకర్ మాట్లాడుతూ గబ్బర్‌సింగ్ అంటేనే ఓ చరిత్ర. మా జీవితాన్ని మార్చేసి న చిత్రమిది. ఎక్కడికి వెళ్లినా ప్రేక్షకులు అభిమానాన్ని చూపించారు. ఇదంతా పవన్‌కల్యాణ్‌గారి గొప్పతనమే నని నమ్ముతున్నా అన్నారు.గబ్బర్‌సింగ్ సినిమా ఎవర్‌గ్రీన్. దేవీశ్రీ పాటలకు థియేటర్లు దద్దరిల్లిపోయాయి.
ఈ సినిమా డబ్బింగ్ సమయంలో పవన్‌కల్యాణ్‌గారు బ్లాక్‌బస్టర్ హిట్ అని చెప్పారు. నేడు ప్రజాజీవితాలను మార్చడానికి నిర్విరామంగా కృషిచేస్తున్న పవన్‌కల్యాణ్‌గారికి గబ్బర్‌సింగ్ యూనిట్ తరపున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నా అన్నారు. తల్లిదండ్రులు జన్మనిస్తే, పవన్‌కల్యాణ్ బతుకునిచ్చాడని, తాను ఆర్థికంగా ఎంత స్థాయికి వెళ్లినా పవన్‌కల్యాణ్‌గారు లేకపోతే తనకు ఈ క్రేజ్ ఉండేది కాదని నిర్మాత బండ్ల గణేష్ అన్నారు. ఏడేళ్లుగా సినిమాలు తీయకపోవడం బాధగా ఉందని, మళ్లీ సినిమాలు చేసి బ్లాక్‌బస్టర్ హిట్స్ కొడతానని ఆయన ధీమా వ్యక్తం చేశారు.